తొలిరోజే టీడీపీకి చుక్కలు చూపించిన జగన్
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ఉదయం నుండి ప్రారంభమైన సంగతి తెల్సిందే.. అసెంబ్లీ సమావేశాలకు వస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీ సేవ్ ఏపీ పేరుతో ప్లకార్డులను,గత నలబై ఐదు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన హత్యాయత్న సంఘటనలను ప్లాకార్డుల్లో ప్రదర్శిస్తూ వచ్చారు..
అసెంబ్లీ ప్రాంగణం లోపల పోలీసు అధికారులు ఎమ్మెల్యే..ఎమ్మెల్సీల చేతుల్లో ఉన్న ప్లాకార్డులను లాక్కున్నారు..అంతేకాకుండా వాటిని చించేశారు..దీంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పోలీసు అధికారులపై అగ్రహాం వ్యక్తం చేశారు..
ఈ క్రమంలో జగన్ మాట్లాడుతూ “పేపర్లు లాక్కుని.. చింపే అధికారం మీకు ఎవరిచ్చారు?..అసెంబ్లీ వద్ద పోలీసులు ఓవరాక్షన్‌పై వైయస్ఆర్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మండిపడ్డారు
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేతిలో నుంచి పేపర్లు తీసుకుని చించివేయడం పద్ధతి కాదు..ఎవరూ అధికారంలో ఉన్న వారికి సెల్యూట్ కొట్టడం కాదు.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.ఎల్లకాలం ఇదే మాదిరిగా ఉండదంటూ హెచ్చరించారు..