జగన్ పై నాగబాబు అగ్రహాం
మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై జనసేన నాయకుడు.. ప్రముఖ నటుడు నాగబాబు తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు. వినుకొండలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన జగన్ మీడియాతో మాట్లాడుతూ ఎన్దీఏ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు వందలకుపైగా హత్య యత్నాలు జరిగాయి..
రెండు నెలలుగా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. అందుకే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని ప్రధానమంత్రి నరేందర్ మోదీని కల్సి చెప్తాము.. రాష్ట్రపతి అపాయింట్మెంట్ తీసుకుని వినతి పత్రం ఇస్తాము.. వినకపోతే ఢిల్లీలో ధర్నాలు చేస్తామని ప్రకటించిన సంగతి తెల్సిందే.
ఈ వ్యాఖ్యలపై నాగబాబు స్పందిస్తూ కొంచెమైన ఆలోచన ఉందా..?. ఈ సలహాలు ఎవరూ ఇస్తున్నారు మీకు..?. ఆ సజ్జల రామకృష్ణారెడ్డినేనా..?. రాష్ట్రపతి పాలన పెట్టాలంటే మీ దుర్మార్గపు పాలనలోనే పెట్టాల్సింది. అసెంబ్లీకి రాకుండా రోడ్లపై ఈనాటకాలు ఏంటి జగన్. ఎన్డీఏ ఎమ్మెల్యేలను మిమ్మల్ని ఏమనోద్దు చెప్తాను.. మీరు అసెంబ్లీ కి రండి.. ప్రజల సమస్యలపై గళమెత్తండి అని సలహా ఇచ్చారు.