మేడిగడ్డపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్
నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలల్లో మేడిగడ్డ ఒకటి. అయితే మేడిగడ్డ బ్యారేజీ మరోకసారి వార్తల్లోకి ఎక్కింది. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లల్లో కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరానిది. అందుకే వరదలకు బ్యారేజీల్లో గేట్లు కొట్టూకోపోయాయి. ఫిల్లర్లు కృంగిపోయాయి అని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించింది.
అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఓ కమిటీ కూడా వేయించింది. తాజాగా ఎగువన కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో వరదలు భారీ ఎత్తున కిందకు వస్తున్నాయి. ఆ వరదలతో కాళేశ్వరం ప్రాజెక్టు నిండుకుండల్లా జలకళలాడుతుంది. ఏకంగా మూడు లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహాం వచ్చిన కానీ మేడిగడ్డ తట్టుకుని నిలబడింది.
ఇది కేసీఆర్ గొప్పతనం.. మేడిగడ్డ ప్రాజెక్టు .. బీఆర్ఎస్ ప్రభుత్వ పనితనం అంటూ బీఆర్ఎస్ శ్రేణులు అభిమానులు సోషల్ మీడీయాలో వైరల్ చేస్తున్నారు.. దీనికి కౌంటరుగా కాంగ్రెస్ శ్రేణూలు గేట్లు మూసేస్తే బయటపడుతుంది కాళేశ్వరం డోల్లాతనం.. మేడిగడ్డ యొక్క నాణ్యత అంటూ రివర్స్ కౌంటర్లు వేస్తున్నారు..
కాసేపు పార్టీలను పక్కన పెడితే గేట్లు మూసిన తెరిచిన మేడిగడ్డ నాణ్యత లేకపోతే అంతటి వరద ప్రవాహాన్ని తట్టుకోలేదు కదా .. తట్టుకుంది అంటే మేడిగడ్డ మంచిదే కదా అని న్యూట్రల్ ఫీపుల్స్ సోషల్ మీడీయాలో ఇరు పక్షాల పోస్టులను చూసి అనుకుంటున్నారు.