రేషన్ కార్డు నిబంధనపై క్లారిటీ
రుణమాఫీ కి రేషన్ కార్డు అవసరమనే వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెల్సిందే. ఈరోజు మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ అని అధికారంలోకి వచ్చారు .ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే రుణమాఫీ అనడం కరెక్ట్ కాదు .ప్రతి ఒక్క రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేయాలి..లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతృత్వంలో ధర్నాలు ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు..
తాజాగా రేషన్ కార్డు నిబంధనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కలెక్టర్లతో జరుగుతున్న సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రుణమాఫీ కోసం రేషన్ కార్డు తప్పనిసరి కాదు. కేవలం ఆ కుటుంబంలో ఎంత మంది సభ్యులున్నారు…రైతుకుటుంబానికి రేషన్ కార్డు ఉన్నదా లేదా అని తెలుసుకోవడానికి …పాస్ బుక్ ఆధారంగా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని అన్నారు..
రుణమాఫీకి రేషన్ కార్డు అవసరంలేదు .దీని గురించి ఎలాంటి వార్తలను నమ్మకండి .ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ అవ్తుంది .ఇది ప్రజాప్రభుత్వం.. రైతుప్రభుత్వం అని ఆయన ఉద్ఘాటించారు.