ముద్రగడ సంచలన ప్రకటన
ఏపీ మాజీ మంత్రి..మాజీ ఎంపీ..కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి సంచలన ప్రకటన చేశారు.. ఈరోజు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ “తనను పవన్, జనసేన అభిమానులు బూతులతో ఇబ్బంది పెడుతున్నారని తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు.
‘ఇలా చేయడం కంటే మమ్మల్ని చంపించండి. మేం అనాథలం. కాపుల హక్కుల కోసం నేను పోరాడలేని అసమర్థుడిని. చేతకానోడిని. కేంద్ర, ఏపీ ప్రభుత్వాలు జనసేనాని..డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్నాయి ..
కాబట్టి కాపులకు రిజర్వేషన్లు ఇప్పించాలి. ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపైనా ఆయన ఆలోచించాలి’ అని ముద్రగడ సూచించారు..