మద్యం ప్రియులకు శుభవార్త
మద్యం ప్రియులకు ఇది నిజంగా శుభవార్తనే. ఏపీ రాష్ట్రానికి కింగ్ ఫిషర్ బీర్ల స్టాక్ తీసుకొచ్చి గోదాముల్లో నిల్వ ఉంచినట్లు తెలుస్తోంది.
ఈమేరకు ప్రస్తుత అధికార పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి ఓ వీడియో ట్వీట్ చేశారు.
‘ఇట్స్ బ్యాక్ ఆల్ ఓవర్ ఏపీ. కింగ్ ది ఫిషర్ చీర్స్’ అని రాసుకొచ్చారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం నాణ్యతలేని మద్యం అమ్ముతోందని అప్పటి ప్రతిపక్ష టీడీపీ విమర్శించిన సంగతి తెలిసిందే.
జూన్ 12న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం తర్వాత ఈ కొత్త మద్యం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది అని టాక్.