తెలంగాణ విద్యార్థుల భద్రతపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు స్పందన
కిర్గిజ్‌స్థాన్‌లోని తెలంగాణ విద్యార్థుల భద్రతపై ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు..కిర్గిజ్‌స్థాన్ రాజధాని బిష్క్‌క్‌లోని భారతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని జగుతున్న హింసాత్మక సంఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. హింసలో పలువురు భారతీయ విద్యార్థులు గాయపడ్డారు.
భారతీయ విద్యార్థులతోపాటు వివిధ దేశాల విద్యార్థులపై స్థానికులు దాడులు చేయడంతో పరిస్థితి దిగజారింది.కిర్గిజ్‌లోని తెలంగాణ విద్యార్థుల భద్రత కోసం వెంటనే పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయాన్ని, భారత ప్రభుత్వ అధికారులను గౌరవనీయులైన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ గారిని, బిష్కెక్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని కోరుతున్నాను.
ఈ సంక్షోభాన్ని గట్టెక్కడానికి, విద్యార్థుల భద్రతపై వారి కుటుంబాలకు భరోసా ఇవ్వడానికి దౌత్యపరంగా పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అని అన్నారు..