ప్రశాంత్ కిషోర్ కు సీఎం జగన్ కౌంటర్
ప్రముఖ ఎన్నికల వ్యూహా కర్త అయిన ప్రశాంత్ కిషోర్‌కు ఆంధ్రప్రదేశ్ సీఎం..వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహాన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున పని చేసిన ఐప్యాక్ టీమ్ సభ్యులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ వైసీపీ కోసం ప్రశాంత్ కిషోర్ చేసిందేమీ లేదు.. చేసేదంతా ఐప్యాక్ టీమే. ప్రశాంత్ కిషోర్ మనకు వ్యతిరేకంగా మారారు.
ప్రశాంత్ కిషోర్ కూడా ఊహించని ఫలితాలు వస్తాయి.. గతంలో కూడా 151 సీట్లు వస్తాయని ఊహించలేదు.. ఈసారి వచ్చే ఫలితాలతో దేశం షాక్ కాబోతుంది.
గతంలో వచ్చిన సీట్ల కంటే ఎక్కువ రాబోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పాలన అందించాం, ఐప్యాక్ సేవలను పరిపాలనలోనూ ఉపయోగించాం.. ఫలితాలతో దేశంలోని ప్రతీ నేత ఏపీ వైపే చూస్తారు.. ఈ ఐదేళ్లకు మించిన గొప్ప పాలన అందిస్తామని ఆయన అన్నారు..