మాజీ సీఎం కేసీఆర్ కు ఈసీ షాక్
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది.. పోరుబాట బస్సు యాత్ర పేరుతో ప్రజాక్షేత్రంలో దూసుకెళ్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై రెండు రోజుల పాటు నిషేధం విధించింది.
ఇటీవల సిరిసిల్ల జరిగిన మీడియా సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలపై కేసును సుమోటగా స్వీకరించిన సీఈసీ విచారణ చేసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.