ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థాయికి ఎదిగిన రాష్ట్రంలో ఈ దుస్థితి ఎందుకు..? – మాజీ కేసీఆర్‌

 ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థాయికి ఎదిగిన రాష్ట్రంలో ఈ దుస్థితి ఎందుకు..? – మాజీ కేసీఆర్‌

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్‌ వన్‌ స్తాయికి ఎదిగిందని, ఇప్పుడు సాగునీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని, అనతి కాలంలోనే రాష్ట్రంలో ఈ దుస్థితి ఎందుకొచ్చిందని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రశ్నించారు.ఇవాళ జనగామ, సూర్యాపేట జిల్లాల్లోని వివిధ మండలాల్లో పర్యటించిన ఆయన.. సూర్యాపేట ప్రెస్‌మీట్‌ నిర్వహించి మీడియాతో మాట్లాడారు.

ఈ రోజు జనగామ జిల్లాలో, కొంతమేరకు బస్సులో ప్రయాణిస్తూ యాదాద్రి జిల్లాలో, అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో ఎండిపోయిన పంట పొలాలను మా బృందం పరిశీలించింది. చాలాచోట్ల రైతులు కన్నీరుమున్నీరై విలపించిన్రు. మేం పెట్టుబడులు పెట్టి నష్టపోయినం, మాకు తగిన పరిహారం ఇప్పించాలని వేడుకున్నరు. ప్రభుత్వం ముందుగా నీళ్లు ఇస్తమని చెప్పింది కాబట్టి తాము పంటలు వేశామని, కానీ తీరా పంటలు వేసిన తర్వాత నీళ్లు ఇవ్వకపోవడంతో నష్టపోయే పరిస్థితి వచ్చిందని రైతులు వాపోయిన్రు’ అని కేసీఆర్‌ తెలిపారు.

‘రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటదనే ఉద్దేశంతో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొన్ని స్పష్టమైన విధానాలు తీసుకుని చర్యలు చేపట్టింది. ఒకటి రైతులకు అనేక పద్ధతుల ద్వారా నీరు సరఫరా చేయడం, రెండోది రైతుబంధు కార్యక్రమం ద్వారా రైతులకు సమయానికి పెట్టుబడి సాయం ఇవ్వడం. మూడోది సాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్‌ అందజేయడం, నాలుగోది ప్రభుత్వమే రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంటలను కొనుగోలు చేయడం, ఐదోది రైతులకు అనుకోనిది ఏదైనా సంభవిస్తే రైతుబీమా అందజేయడం. ఈ విధంగా అద్భుతమైన విధానాలను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసింది’ అని కేసీఆర్‌ గుర్తుచేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *