పాలేరు రిజర్వాయర్ ను పరిశీలించిన ఎంపీ నామ

 పాలేరు రిజర్వాయర్ ను పరిశీలించిన ఎంపీ నామ

తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన ఖమ్మం పార్లమెంట్ ఎంపీ నామ నాగేశ్వరరావు నేతృత్వంలో ఈరోజు ఆదివారం బీఆర్ ఎస్ పార్టీ ప్రతినిధి బృందం పాలేరు రిజర్వాయర్ను పరిశీలించింది.

ఈ సందర్భంగా ఎంపీ నామ మాట్లాడుతూ వెంటనే సాగర్ జలాలతో పాలేరు రిజర్వాయర్ ను నింపి, ప్రజల దాహార్తిని, ఎండిపోతున్న పంటలను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, లింగాల కమలరాజు, శ్రీ సండ్ర వెంకట వీరయ్య, కూరాకుల నాగభూషణం, మదన్ లాల్, చంద్రావతి, బెల్లం వేణు, వీరన్న, కూసుమంచి, నేలకొండపల్లి, పాలేరు, తిరుమలయపాలెం మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *