తెలంగాణలో పంచాయితీ ఎన్నికలపై కీలక అప్ డేట్..!

తెలంగాణలో గత రెండు ఏండ్లుగా ఖాళీగా ఉన్న గ్రామ పంచాయితీలకు ఎన్నికలను నిర్వహించడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. అందులో భాగంగా నిన్న మంగళవారం ఎన్నికల సంఘం పంచాయితీల్లో ఓటరు సవరణ ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది.అందులో భాగంగా వచ్చేనెల సెప్టెంబర్ రెండో తారీఖు నాటికి రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లో ఫొటో ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని జిల్లా పంచాయతీ అధికారులను ఎన్నికల సంఘం ఆదేశించింది.
ఈనెల ఆగస్టు 28న డ్రాఫ్ట్ రోల్స్ పబ్లికేషన్, 29న జిల్లా స్థాయి సమావేశం, 30న మండల స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని ఈసీ ఇప్పటికే తెలిపింది. ఆగస్టు 28-30 వరకు అభ్యంతరాలు స్వీకరించాలని, 31న వాటిని పరిష్కరించాలని కూడా పేర్కొంది. తాజాగా స్థానిక ఎన్నికల షెడ్యూల్ వచ్చే నెల సెప్టెంబర్ మొదటి వారంలోనే ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం తాజా ఆదేశాల నేపథ్యంలో ఈ నెల 30న జరగనున్న క్యాబినెట్ భేటీలో దీనిపై క్లారిటీ రానుంది.
ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను వచ్చేనెల చివరి వారంలో నిర్వహించే అవకాశం ఉంది. ఆ తర్వాత వారానికే అంటే అక్టోబర్ మొదటివారంలోనే రెండేండ్లుగా ఖాళీగా ఉన్న పంచాయితీలకు సర్పంచ్ ఎన్నికలు ఉంటాయని తెలుస్తోంది.