రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో ప్రమాదంలో కాంగ్రెస్ …!

 రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో ప్రమాదంలో కాంగ్రెస్ …!

Loading

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి బీహార్ లో రాహుల్ గాంధీ నిర్వహించిన ఓటు చోరీ కార్యక్రమంలో   చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలో   కాంగ్రెస్ మెడకు చుట్టుకోనుందా? ..అంటే అవుననే అనిపిస్తోంది. నిజానికి బీహార్‌లో ఈసారి కొంత కాంగ్రెస్‌కు సానుకూల వాతావరణం ఉందని అక్కడి జనం టాక్. లోక్ సభ పక్షనేత , కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఏదో కిందామీదా పడి నాలుగు ఓట్లు సంపాదించుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఓట్ చోరీ నినాదంతో బీజేపీని ఇరుకున పెట్టే అంశం ఎంచుకుని బీహార్‌లో రాజకీయ లబ్ది పొందాలని ఆయన కష్టపడుతున్నాడు.

నిన్న బీహార్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి పాల్గొనడం రాజకీయ వివాదానికి దారితీసింది. గతంలో అనేకసార్లు బీహారీల మీద రేవంత్ చేసిన చౌకబారు వ్యాఖ్యలు ఇప్పుడు అక్కడ పాపులర్ చేస్తున్నారు కాంగ్రెస్ ప్రత్యర్ధులు.

నిన్న అటు బీజేపీ నుండి కేంద్ర మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్, ఇటు జన సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఇద్దరూ రేవంత్ రెడ్డి చేసిన చౌకబారు వ్యాఖ్యలు గుర్తుచేస్తూ, అసలు బీహార్‌లో ఆయన అడుగుపెట్టే అర్హత లేదని, ఆయనను వెంటేసుకుని తిరగడానికి రాహుల్ గాంధీకి సిగ్గులేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అటు సుప్రీం కోర్టు నుండి మొదలు కొని ఇటు బీహారీల వరకూ అసలు రేవంత్ నోటిదురుసుకు, అసందర్భ ప్రేలాపనలకు గురికాని వారెవరూ లేరు. రేవంత్ రెడ్డి  బీహారీల మీద గతంలో పలుమార్లు చేసిన నీచమైన వ్యాఖలే ఇప్పుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీల మెడకు గుదిబండ కానున్నాయి అనిపిస్తోంది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *