సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : పహల్గాం లో పర్యాటకులపై పాక్ ఉగ్రవాదుల దాడికి నిరసనగా పాకిస్థాన్ లోని ఉగ్రవాదుల స్థావరాలపై, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలపై భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడి నిర్వహించిన సంగతి తెల్సిందే. ఈ దాడిలో దాదాపు వందకు పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. పాక్ ఉగ్రవాదుల స్థావరాలన్నీ ధ్వంసమయ్యాయి. మే నెల ఏడో తారీఖున పీఓకే, పాక్ లోని జైషే మహ్మద్ , లష్కరే తొయిబా ఉగ్ర స్థావరాలను ఇండియన్ […]Read More
Tags :national news
పహల్ గామ్ లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా భారత్ లోకి పాకిస్తానీయులకు అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలిపింది. ఇక్కడున్న పాకిస్థాన్ ప్రజలు.. అధికారులు నలబై ఎనిమిది గంటల్లో ఇండియాను వదిలివెళ్లాలని హూకుం జారీ చేశారు. ఇరు దేశాల మధ్య ఉన్న అటారి-వాఘా చెక్‌పోస్ట్ మూసివేశారు.. అంతేకాకుండా ఇక నుండి పాకిస్థాన్ కు చెందినవాళ్లకు నో వీసా. సింధు జలాల ఒప్పందం నిలిపివేస్తున్నాము.భారత్ నుంచి వెళ్లాలని పాక్ హైకమిషన్‌కు ఆదేశించారు. ఉగ్రదాడిలో […]Read More
సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ జోయ్ మల్య బాగ్చీ బాధ్యతలు..
దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీంకోర్టు నూతన జడ్జిగా జస్టిస్ జోయ్‌మల్య బాగ్చీ నిన్న సోమవారం బాధ్యతలు చేపట్టారు. సుప్రీంకోర్టు కొలిజియం జస్టిస్ జోయ్‌మల్య బాగ్చీను ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో తాజాగా ఆయన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఈయన కలకత్తా జడ్జిగా విధులు నిర్వహిస్తూ పదోన్నతిపై సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు…Read More
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అస్వస్థతకు గురయ్యారు.. నిన్న శనివారం అర్థరాత్రి 2 గంటల సమయంలో తీవ్ర అస్వస్థతకి గురవ్వడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో జగదీప్ ధన్ఖడ్ ను చేర్చారు.. ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో ఎయిమ్స్ ఆస్పత్రిలో ధన్ఖడ్కు చికిత్స అందిస్తున్నారు..Read More
అమెరికా వీసా, గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే భారతీయులు ఇమ్మిగ్రేషన్ దరఖాస్తులతోపాటు తమ సోషల్ మీడియా ఖాతాల సమాచారాన్ని కూడా ఇప్పుడు అంద చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని అమెరికా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్(డీహెచ్ఎస్) మార్చి 5న ఓ నోటీసులో వెల్లడించింది. గ్రీన్ కార్డులు, పౌరసత్వం, ఇతర ప్రయోజనాలు కోరుతూ దరఖాస్తు చేసుకునే భారతీయులు సహా ఏటా 35 లక్షల మందికిపైగా విదేశీయుల నుంచి ఈ సమాచారాన్ని కోరనున్నట్టు డీహెచ్ఎస్ ప్రకటించింది. ఇమ్మిగ్రేషన్ స్క్రీనింగ్ను కట్టుదిట్టం […]Read More
భారత్, చైనాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాకిచ్చారు. ఏప్రిల్ 2 నుంచి ఈ దేశాలపై ప్రతీకార పన్నులు విధిస్తామని ప్రకటించారు. తమపై సుంకాలు విధించే దేశాలపై తామూ అదే రీతిన వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. అధ్యక్షునిగా ఎన్నికయ్యాక తొలిసారి నిర్వహించిన కాంగ్రెస్ మీటింగ్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.Read More
తమిళనాడు దివంగత సీఎం.. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆస్తులు ఎంతో తెలుసా..?. అక్షరాల ఒకటి కాదు రెండు కాదు నాలుగు వేల కోట్లకుపైగా ఉంటాయి. అసలు విషయానికి వస్తే ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి తమిళనాడు దివంగత సీఎం జయలలితకు చెందిన ఆస్తులు, పత్రాలను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి బెంగళూరులోని కోర్టు అధికారులు అప్పగించారు. వీటిలో మొత్తం 10,000 చీరలు, 750 జతల పాదరక్షలు, 27 కిలోల బంగారం, వజ్రాభరణాలు, రత్నాలు, 601 కిలోల వెండి […]Read More
ఏఐసీసీ సీనియర్ నాయకులు.. లోక్ సభ పక్షనేత రాహుల్ గాంధీ ఈరోజు తెలంగాణకు రానున్నారు. ఇందులో భాగంగా సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటారు. అక్కడ నుండి హనుమకొండలో జరగనున్న ఓ ప్రైవేట్ కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరవుతారు. అనంతరం ట్రైన్లోనే చెన్నైకి తిరిగి ప్రయాణం కానున్నారు.Read More
రైల్వేలో 95,000ల ఖాళీలు త్వరలో భర్తీ: అశ్వినీ వైష్ణవ్..
దేశంలో ఉన్న నిరుద్యోగులకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గుడ్ న్యూస్ అందించారు. ఇటీవల ప్రకటించిన 1.5 లక్షల నియామకాలకు అదనంగా కొత్తగా 95,000ల ఖాళీలు త్వరలో భర్తీ చేస్తామని ప్రకటించారు. బీహార్‌లోని బెట్టియా జంక్షన్‌లో మీడియా ప్రతినిధులతో ఆదివారం ఆయన మాట్లాడారు. నమో, వందే భారత్ రైళ్లకు అద్భుతమైన స్పందన వస్తోందన్నారు. వీటి ఉత్పత్తి పెంచుకోవాలని రైల్వే శాఖ నిర్ణయించిందన్నారు.Read More
నిన్న శనివారం విడుదలైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం ఇరవై రెండు స్థానాలకే పరిమితమైంది. మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సీనియర్ నాయకులు.. మాజీ మంత్రులైన సత్యేంద్ర జైన్, మనీశ్ సిసోడియా లాంటి ఆప్ అగ్రనేతలందరూ ఓటమి పాలయ్యారు. ముఖ్యమంత్రి అయిన అతిశీ తప్పా ఎవరూ గెలవలేకపోయారు. మరోవైపు దాదాపు రెండున్నర దశాబ్ధాలుగా ఢిల్లీ పీఠానికి దూరమైన బీజేపీ నలబై ఎనిమిది స్థానాలతో అధికారాన్ని దక్కించుకుంది. ఈ […]Read More