అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి

అబద్దాలకు, అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. అసెంబ్లీలో అవే అబద్దాలు, బయటా అవే అబద్దాలు అని, 13 రోజులు గడుస్తున్నా వైద్యారోగ్య శాఖలోని టివివిపి విభా గంలో ఉన్న 13వేల మందికి జీతాలు చెల్లించనిది వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు.
డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నది సిఎం కళ్లకు కనిపిం చడం లేదా..? అని అడిగారు. ఆరోగ్య శాఖలోనే కాదు, పోలీసు శాఖలోనూ ఇదే దుస్థితి అని పేర్కొ న్నారు. పెంచిన జీతాలు, అలవెన్సుల మాట దేవు డెరుగు, ఉన్న జీతాలు ఇప్పటికీ రాక హోం గార్డులు ఆవేదన చెందుతున్నది నిజం కాదా..? అని ప్రశ్నించారు.
ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తు న్నామనే అబద్దాన్ని, అవకాశం ఉన్న చోటల్లా ప్రచారం చేసుకునే సిఎం రేవంత్రెడ్డికి, వేతనాలు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుం బాల ఆవేదన అర్థం కావడం లేదా..? అని నిలదీ శారు. దుష్ప్రచారంతోనే ఏడాదిన్నర గడిపారు.. ఇంకెంత కాలం వెళ్లదీస్తారని అన్నారు. టివివిపి డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది సహా, కాం ట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, హోం గార్డు లకు వెంటనే వేతనాలు విడుదల చేయాలన్నారు.