కాంగ్రెస్ పాలనలో 480 మంది రైతులు ఆత్మహత్య

480 farmers committed suicide during Congress rule
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కార్ ఘోర వైఫల్యం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 480 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.. ఎక్కడికక్కడ పంటలు ఎండిపోయి రైతులు ఆందోళనలో ఉన్నారు.
పంటలు ఎండకుండా నీళ్లు వదులుతారని గవర్నర్ నోటి వెంట మాట వస్తాడని ఆశతో ఉన్న రైతులకు నిరాశే మిగిలింది అని అసెంబ్లీ సమావేశాల వాయిదా అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అసమర్థత వల్ల ప్రాజెక్టులు ఎండిపోయాయి. కాళేశ్వరాన్ని ఎండబెట్టారు. ఎస్ఎల్బీసీను పనికిరాకుండా చేశారని అన్నారు.
