కాంగ్రెస్ సర్కారుకి నో విజన్.. ఓన్లీ కమీషన్..

Congress government has no vision..only commission..
తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి నో విజన్.. ఓన్లీ కమిషన్ ఉందంటూ మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడిననంతరం మాజీ మంత్రి కేటీఆర్ మీడియా పాయింట్ దగ్గర మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్లు.. జరగంది మన తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగింది.
తమ బిల్లులను విడుదల చేయడానికి ఇరవై శాతం పదిహేను శాతం కమీషన్లు అడుగుతున్నారు అని కాంట్రాక్టర్లు సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి.. ఆర్థిక శాఖ మంత్రి అయిన భట్టి మల్లు విక్రమార్క చాంబర్ నందు ధర్నాలకు దిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజన్ లేదు కేవలం 20% కమిషన్ మాత్రమే ఉంది.
ఢిల్లీకి మూటలు పంపడం తప్ప రేవంత్ రెడ్డికి వేరే విజన్ ఏమీ లేదు.భారతదేశ చరిత్రలోనే సచివాలయంలో కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ధర్నా చేయడం బహుశా ఇదే మొదటిసారి.కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల గురుకులాల్లో చనిపోయిన విద్యార్థులకు కనీసం సంతాపం కూడా తెలపని అసమర్థ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని ఆయన విమర్శించారు.
