రేవంత్ రెడ్డికి కేటీఆర్ మాస్ వార్నింగ్…!

KTR’s mass warning to Revanth Reddy…!
డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన తెలంగాణ విగ్రహావిష్కరణ చేసిన సంగతి తెల్సిందే. సచివాలయం బయట ఎదురుగా అమరవీరుల జ్యోతి పక్కన దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.
వీటి గురించి మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నువ్వు ఎప్పుడూ ముఖ్యమంత్రిగా ఉండవు. కాంగ్రెస్ శాశ్వతంగా అధికారంలో ఉండదు. రాబోయే మూడేళ్ల తర్వాత మేమే అధికారంలోకి వస్తాము.
మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే కాంగ్రెస్ తల్లిని, రాహుల్ గాంధీ తండ్రిని సెక్రటేరియట్ నుండి మంచిగా మూట కట్టి గాంధీ భవన్కు పంపిస్తాము. అప్పుడు మీకు నచ్చినట్లు ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకోండి అని వార్నింగ్ ఇచ్చారు.
