రేవంత్ రెడ్డికి కవిత మాస్ వార్నింగ్..!

Ambedkar was insulted by his anger at KCR..!
బీఆర్ఎస్ సీనియర్ మహిళా నాయకురాలు.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు మంగళవారం తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది.
అధికారంలోకి రాకముందు ఆ పార్టీ సీనియర్ నాయకులు…ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ నిజామాబాద్ వచ్చి పసుపు పండించే రైతులకు కనీసం మద్ధతు ధర పదిహేను వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక కనీసం పదివేలు కాదు తొమ్మిది వేలు కూడా ధర పలకడం లేదు అని ఆమె ఆరోపించారు.
సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే కింటా పదిహేను వేలు ఇచ్చి పసుపు పంటను కొనాలని ఆమె డిమాండ్ చేశారు. లేకపోతే పసుపు రైతులందరితో కల్సి ప్రజాభవన్ ను అసెంబ్లీని ముట్టడిస్తామని వార్నింగ్ ఇచ్చారు.