తెలంగాణలో కాంగ్రెస్ మార్కు పాలన

హైదరాబాద్ మార్చి7 (సింగిడి)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పాలనపై మాజీ మంత్రి తన్నీరు హారీశ్ రావు ఎక్స్ వేదికగా విమర్శలు కురిపించారు. తన అధికార ట్విట్టర్ అకౌంటులో కాంగ్రెస్ పాలనపై స్పందిస్తూ ” ఉమ్మడి రాష్ట్రంలోని గత పాలకుల పాలనలోని నాటి నీటి గోస దృశ్యాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్ల మళ్ళీ చూస్తున్నాము..
రాష్ట్రంలోని అదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం చింతకర్ర గ్రామ గిరిజనులు తాగు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు.. ఉమ్మడి పాలన నాటి నీటి గోస దృశ్యాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్ల మళ్ళీ చూస్తున్నాము..
కేసీఆర్ ప్రభుత్వం ఎంతో విజయవంతంగా అమలు చేసిన మిషన్ భగీరథ నీళ్ల సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వేసవి వేళ మారుమూల ప్రజలకు శాపంగా మారింది.భుజాలు కాయలు కాసేలా బిందెలు మోస్తూ, వాగులు, వ్యవసాయ బావుల నుండి నీళ్ళు తెచ్చుకునే దుస్థితిని కల్పించింది.
పథకాలు అమలులో వైఫల్యం.పరిపాలనలో వైఫల్యం
చివరకు కేసీఆర్ గారు ప్రారంభించిన మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు చేయడంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యమైందని ట్వీట్ చేశారు.