మాటలు కోటలు.! చేతలు గడపలు దాటడంలేదు..!

Words are castles. Hands do not cross the threshold..!
ఫిబ్రవరి నెల వచ్చి 12 రోజులు గడుస్తున్నా ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలంటూ గప్పాలు చెప్పుకుంటున్నా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదహారు వేల మంది హోంగార్డులకు జీతాలు చెల్లించకపోవడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు మండిపడ్డారు. హోంగార్డులకు 12 రోజులు గడుస్తున్నా జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటని ‘ఎక్స్’లో ఫైర్ అయ్యారు.
‘తక్కువ జీతాలపై ఆధారపడి జీవిస్తున్న హోంగార్డులు.. చేతిలో చిల్లిగవ్వలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, రోజువారీ ఖర్చుల కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి. ఈఎంఐలు చెల్లించకపోవడం వల్ల బ్యాంకు అధి కారులు ఫోన్లు చేసి నిలదీస్తున్న దుస్థితి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి నెల ఇదే తీరు కొనసాగుతున్నా పట్టించుకునే వారే లేరు.
మాటలు కోటలు దాటితే, చేతలు గడప దాటని ముఖ్యమంత్రి వీరికి ఏం సమా ధానం చెబుతారు?’ అంటూ నిలదీశారు. పథ కాల్లో కోతలు, జీతాలు చెల్లించకుండా ఉద్యోగు లకు వాతలు.. ఇది ప్రజాపాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన అంటూ మండిపడ్డారు. హోంగా ర్థులకు వేతనాలు తక్షణం చెల్లించాలని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హారీశ్ రావు డిమాండ్ చేశారు.
