కేసీఆర్..కేటీఆర్..హారీష్ రావులపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.!
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల వేదికగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. మాజీ మంత్రులు కేటీఆర్ ,హారీష్ రావులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేలో తమకున్న భూముల వివరాలు చెప్పాల్సి వస్తుందనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. మాజీ మంత్రులు కేటీఆర్..హారీష్ రావులు .. ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కులగణన సర్వేలో పాల్గొనలేదని విమర్శించారు.
అలాంటి వారికి అసెంబ్లీలో మైక్ ఇవ్వొద్దని సభాపతిని కోరారు. గతంలో ఎంతో హట్టహాసంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాయాంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వేను మంత్రివర్గం, అసెంబ్లీలో ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు.
ఆ సర్వేను ఓ కుటుంబం దాచి పెట్టుకుందని విమర్శించారు. ఆ సర్వేను సైట్లో పెట్టామని కేటీఆర్ చెప్పగా, అందులోనూ పెట్టలేదని ముఖ్యమంత్రి ఫైరయ్యారు.