ఇదేనా మీరు చెప్పిన సోకాల్డ్ ప్రజా పాలన..?

 ఇదేనా మీరు చెప్పిన సోకాల్డ్ ప్రజా పాలన..?

Revanth Reddy is lime for the rice donor

తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా, మైలారంలో మైనింగ్ కు వ్యతిరేకంగా గ్రామస్తులు చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన పౌరహక్కుల నేత, ప్రొఫెసర్ హరగోపాల్ గారిని అరెస్టు చేయడం అమానుషం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆయన తన ట్విట్టర్ లో స్పందిస్తూ ప్రజా పాలన, ప్రజాస్వామ్య పునరుద్దరణ అంటూ గప్పాలు కొట్టారు..

ఇప్పుడు ప్రజల తరుపున పోరాటం చేస్తున్న ప్రజా సంఘాల నాయకుల గొంతులు నొక్కడం అమానుషం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారూ.. ఇదేనా మీరు చెప్పిన సోకాల్డ్ ప్రజా పాలన. ఇందిరమ్మ రాజ్యమని చెప్పిన మీరు కంచెలు, ఆంక్షలు, అరెస్టులతో నాటి ఎమర్జెన్సీ పాలనను గుర్తు చేస్తున్నారు. మీ సొంత జిల్లాలోనే ఇంతటి దారుణ పరిస్థితులు ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మైలారంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు.? ప్రొఫెసర్ హరగోపాల్ సహా అరెస్టులు చేసిన ప్రజా సంఘాల నాయకులను తక్షణం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని ట్వీట్ చేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *