ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్..!
నిన్న మంగళవారం జూబ్లీహిల్స్ 10టీవీ న్యూస్ ఛానెల్ లో ఇంటర్వూ ముగించుకుని బయటకు వచ్చిన హుజూర్ బాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెల్సిందే.
కరీంనగర్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఓ సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పై దాడికి దిగిన ఘటనలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.
తాజాగా ఆయన రిమాండ్ రీపోర్టును జడ్జి కొట్టేశారు.ఈ రోజు ఉదయం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టు ముందు హాజరుపరిచారు. జడ్జి బెయిల్ మంజూరు చేశారు. రూ పది వేల చొప్పున మూడు పూచీకత్తులు ఇవ్వాలని ఈ సందర్భంగా కోర్డు పాడి కౌశిక్ రెడ్డిని ఆదేశించింది.