ఈనెల 9న కేటీఆర్ విచారణకు వెళ్తారు..!
బీఆర్ఎస్ సీనియర్ నేత.. మాజీ మంత్రి.. ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు నందినగర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ” ఈ నెల తొమ్మిదో తారీఖున ఏసీబీ విచారణకు మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారు.
హైకోర్టు విచారణకు హాజరు కావాలని తీర్పునిస్తే కొంతమంది కాంగ్రెస్ నేతలు వక్రమాటలు మాట్లాడుతున్నారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో జరిగిన అవతవకలు.. అవినీతిని డైవర్ట్ చేయడానికి కుట్రలు చేస్తున్నారు. మరికొంతమంది బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడతారు.. పదేండ్ల పాలనలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచాము..
ఏడాది పాలనలో హైదరాబాద్ ఇమేజ్.. తెలంగాణ ఇమేజ్ ను తగ్గించారు. తప్పు జరిగిందని హైకోర్టు చెప్పినట్లు తప్పుడు ప్రచారం చేశారు. న్యాయపరంగా ముందుకెళ్తాము.. మేము తప్పు చేయలేదు.. న్యాయస్థానంలో ఎదుర్కుంటాము. కలిసి కట్టుగా పోరాడతాము.. చివరికి న్యాయమే గెలుస్తుంది. అక్రమ అరెస్టులకు మేము భయపడం అని అన్నారు.