తగ్గిన బంగారం ధరలు..!
కొత్త ఏడాదిలో గత రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు శనివారం వీకెండ్ లో తగ్గాయి. 24 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర రూ.490 తగ్గింది.
దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.78,710లు పలుకుతుంది. మరోవైపు ఇరవై రెండు క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.450లు తగ్గింది.
దీంతో 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర రూ.72,150లు ఉంది.ఇటు వెండి ధర కేజీపై రూ.1000లు తగ్గింది. మొత్తంగా వెండి కేజీ రూ.99,000లు పలుకుతుంది.