రేవంత్ రెడ్డిది కుటుంబ పాలన.. ఎందుకంటే..?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది కుటుంబ పాలన అని ఎందుకు ఆరోపిస్తున్నారు. గతంలో మీది కుటుంబ పాలన అని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కాబట్టి ఇప్పుడు ఇలా అంటున్నారా అని ప్రముఖ న్యూస్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో ఇంటర్వర్ మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను అడిగారు. దీనికి సమాధానంగా మాజీ మంత్రి కేటీఆర్ బదులిస్తూ ” తొమ్మిదేండ్లలో నేను సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుండి.. మాజీ మంత్రి హారీష్ రావు సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి.. నిజామాబాద్ నుండి కవిత ఎంపీగా గెలుపొందాము..
మమ్మల్ని ప్రజలు ఓట్లేసి గెలిపించారు. అంతేకానీ మాకంటూ మేము పదవులు తీసుకోలేదు. మాకు మేము ఎలాంటి పదవుల్లేకుండా జనాల్లోకి రాలేదు. ఏమి పదవి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి వికారాబాద్ కలెక్టర్ ను కలుస్తాడు. ఏ పదవి ఉందని లగచర్ల గ్రామానికి వెళ్లి రైతులందరూ భూములివ్వాలి.. ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని బెదిరిస్తారు.
సాక్షాత్తు ఆ జిల్లాకు చెందిన ఎంపీ ఎమ్మెల్యేలకు లేని ప్రోటోకాల్ తిరుపతిరెడ్డికి ఎందుకిస్తారు..?. ఏ హోదాలో కట్టబెడతారు. లగచర్ల గొడవ అయినాక రెండోందల కార్లతో వెళ్లడానికి తిరుపతి రెడ్డికి అవకాశమిస్తారు. ఎంపీ ఎమ్మెల్యేలకు కనీసం ఒక్కరికి కూడా అనుమతి ఉండదా..?. ఇప్పుడు చెప్పండి ఎవరిది కుటుంబ పాలన అని బదులిచ్చారు.