రేవంత్ రెడ్డికి కేటీఆర్ బిగ్ షాక్..?
ఫార్ములా ఈ రేసింగ్ కేసులో అరెస్ట్ చేస్తారనే భయంతోనే మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విదేశాలకు వెళ్లిపోయారని ఇటు అధికార కాంగ్రెస్ నేతలు.. అటు ఆ పార్టీ అనుకూల మీడియా పలు కథనాలను ప్రచురించిన సంగతి తెల్సిందే.
తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజాసేవలో మీరు నూరేళ్ళు చల్లగా ఉండాలి.. నేను హైదరాబాద్ లోనే ఉన్నాను..
మీ ఏసీబీ అధికారులు ఎప్పుడైన రావోచ్చు.. ఎప్పుడైన అరెస్ట్ చేసుకోవచ్చు.. మీ ఏసీబీ అధికారులతోనే మీ బర్త్ డే కేకు కట్ చేయిస్తాను.. వారికి నేనే స్వయంగా ఉస్మానియా బిస్కెట్లు.. ఛాయ్ ఇస్తాను అని ట్వీట్ చేశారు. దీంతో కేటీఆర్ విదేశాలకెళ్లారనే వార్తలకు చెక్ పెట్టినట్లయింది.