కాంగ్రెస్ లో కోల్డ్ వార్ కు తెరలేపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే

 కాంగ్రెస్ లో కోల్డ్ వార్ కు తెరలేపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ కాంగ్రెస్ లో కోల్డ్ వార్ మొదలైన సంగతి తెల్సిందే. బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు ఇటీవల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోన్న సంగతి తెల్సిందే. తాజాగా జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో అది తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేత.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి సంబంధించిన అనుచరుడు హత్యకు గురైన సంగతి తెల్సిందే.

ఈ సంఘటనపై జీవన్ రెడ్డి తీవ్ర మనస్థాపం చెందిన సంగతి కూడా తెల్సిందే. దీంతో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశాడు. తాజాగా ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ జీవన్ రెడ్డి ఏదో రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారు.

నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు.. నేను ఇంకా బీఆర్ఎస్ కు రాజీనామా చేయలేదు. ఇంతవరకూ నాకు కాంగ్రెస్ మెంబర్షిప్ కూడా లేదు అని వ్యాఖ్యానించారు. జీవన్ రెడ్డి కావాలనే ఇలా వ్యాఖ్యానిస్తున్నారు. ఆయనకు ఉన్న రాజకీయ లబ్ధి ఏంటో తెల్వదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *