కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం..!

Thanneeru Harish Rao Former Minister Of Telangana
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన గత పదినెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ప్రజావ్యతిరేకతను మూటకట్టుకుంది. మాయ మాటలతో.. అలవి కానీ హామీలతో అన్ని వర్గాలకు అన్యాయం చేసింది అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అన్నారు.
సిద్ధిపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” గత పది నెలలుగా ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయి విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది..అకాడమిక్ ఇయర్ ఎండిగ్ అవుతున్న నేపథ్యంలో 13 లక్షల మంది విద్యార్థుల జీవితాలను అగమ్యగోచరంగా మార్చిందని ఆయన మండిపడ్డారు.
విద్యాసంస్థల యాజమాన్యాలు టీసీ, ఇతర సర్టిఫికెట్లు ఇవ్వని కారణంగా ఈ విద్యాసంవత్సరం చదువును కోల్పోయే పరిస్థితి వచ్చిందని మాజీ మంత్రి హారీష్ రావు పేర్కోన్నారు.తొమ్మిదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రూ.19 వేల కోట్లు ఫీజుల కోసం నిధులు విడుదల చేశామని తెలిపారు. ఏటా సగటున క్రమం తప్పకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్‌కోసం రూ.2వేల కోట్లు విడుదల చేసినట్లు ఆయన వివరించారు