ఖమ్మం వరద తెల్చిన ఆ 3గ్గురి సత్తా..?

Khammam Floods
ఖమ్మం రాజకీయ చైతన్యానికి గడ్డ.. తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చిన నేల.. తొలి అమరుడు నేలకొరిగిన అడ్డ. మలిదశ తెలంగాణ ఉద్యమానికి సైతం అండగా నిలిచిన గుమ్మం. ఇటు తెలంగాణ అటు ఆంధ్రా సరిహద్దు ఖిల్లా. పదేండ్ల తెలంగాణోడి పాలనలో అభివృద్ధిలో నంబర్ వన్ జిల్లాగా అవతరించిన జిల్లా.. అయితేనేమి అప్పటి అధికార ఇప్పటి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు ఒక్క స్థానం మాత్రమే ఇచ్చింది. ఎంపీ ఎన్నికల్లోనూ అదే ఫలితం . కానీ అధికార కాంగ్రెస్ పార్టీకి మాత్రం తొమ్మిది ఎమ్మెల్యే.. ఒకటి ఎంపీ స్థానం కట్టబెట్టింది.
అలాంటి ఖమ్మం గత వారం రోజులుగా వరదలతో.. భారీ వర్షాలతో అతలాకుతలమైంది. తెలంగాణ ఏర్పడిన మొదట్లో వచ్చిన వరదల సమయంలో ఖమ్మం మాజీ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నిత్యం జనాల్లో ఉంటూ వరదల నుండి ఖమ్మాన్ని రక్షించారని ఇప్పటి వరద బాధితులు చెబుతున్న మాటే కాదు జగమెరిగిన సత్యం . కానీ తాజాగా వరదలోచ్చిన సమయంలో డిప్యూటీ సీఎం తో సహా రెవిన్యూ,వ్యవసాయ మంత్రులు ఆ జిల్లా నుండే.. వరదలు వచ్చినప్పుడు బాధితులకు అందే సహాయ కార్యక్రమాలపైనే ఎమ్మెల్యే అయిన మంత్రులైన అధికార పార్టీ సత్తా అయిన తెలిసేది.
అయితే మున్నేరు వాగు బ్రిడ్జి పై తొమ్మిది మంది ఇరుక్కుపోయారు. రావడానికి వీలు లేదు. హెలికాప్టర్ తెప్పించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడ్ని అడిగారు అంటేనే ఇక్కడి మంత్రుల సత్తా ఏంటో తేటతెల్లమవుతుంది. ఒకపక్క డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తోన్న మధిర అసెంబ్లీ నియోజకవర్గం వరదల్లో ఉందని రాత్రి అనక పగలు అనక ట్రాక్టర్ పైనో.. నడుచుకుంటో వెళ్లి వరద బాధితులకు అండగా ఉన్నారని మధిర నియోజకవర్గ ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
తమకు అన్నం పెట్టినోడ్ని కాదని ఏదో చేస్తాడని తుమ్మలను గెలిపిస్తే మమ్మల్ని వరదల్లోకి నెట్టేసి ఆగం చేశారని ఖమ్మం వరద బాధితులు వీడియోలు. మీడియా ముందు ఆవేదనను వ్యక్తం చేశారంటేనే వ్యవసాయ శాఖ మంత్రి పనితనం ఏంటనేది కండ్ల ముందు కన్పిస్తుంది అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు . ఇక పక్క అసెంబ్లీ పాలేరు నుండి గెలుపొంది మంత్రి అయిన పొంగులేటి గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదన్నట్లు.. వరదలోచ్చినప్పుడు ఎవరైన ఆపరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటూ బాధితులకు అండగా ఉంటారు కానీ బైక్ పై రైడర్ లా వెళ్తే కాలికి దెబ్బ తగలకుండా .. కింద పడకుండా ఉంటారా అని బీఆర్ఎస్ శ్రేణులు,నెటిజన్లు ఆ కాలికి దెబ్బతగిలిన వీడియోలను వైరల్ చేస్తూ ట్రోల్స్ చేశారు.
ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు వచ్చినప్పుడు తప్పా పొంగులేటి ఎక్కడ కూడా కన్పించకపొవడం శోచనీయం అని వరద బాధితులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి వచ్చి అధికార యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించేవరకు వరద బాధితులకు సహాయ పనులు నత్తనడకన నడవటం.. ముఖ్యమంత్రి ప్రకటించిన వరద సాయం మినహా మంత్రులు పొంగులేటి,తుమ్మల మాకు చేసింది ఏమి లేదు.
మంత్రిగా పువ్వాడ ఉన్నప్పుడే బాగుందని వరద బాధితులు తమ అసహానాన్ని వ్యక్తం చేయడం బట్టి చూస్తేనే ఆర్ధమవుతుంది మంత్రులుగా వీళ్ల సత్తా.. మంత్రులుండి ఏమి చేయలేపోయారు అని సీనియర్ మాజీ మంత్రులు తన్నీరు హారీష్ రావు,సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,వేముల ప్రశాంత్ రెడ్డి విమర్షించడం ఇక్కడ చర్చానీయంశమౖంది.
