తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఈ నిర్ణయంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పీడియాట్రిక్స్ , గైనకాలజీ , ఆర్థోపెడిక్స్ , జనరల్ మెడిషన్ వంటి ఇలా తొమ్మిది రకాల వైద్య సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఆయా ఆసుపత్రుల్లో డాక్టర్ల లభ్యత ఆధారంగా ఒక్కొక్క రోజు ఒకటి లేదా రెండు రకాల వైద్యసేవలను ప్రజలకు అందుబాటులో ఉండేలా ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది. దీనికోసం గ్రామాల్లోకి వెళ్లి మరి పనిచేసే వైద్యులకు ప్రభుత్వం ఇచ్చే ఇన్సెంటివ్స్ మరింత ఎక్కువగా అందజేయనున్నది.
ప్రాథమిక హెల్త్ సెంటర్స్ లో బేసిక్ పరీక్షలు చేసి అవసరమైన సర్జరీలకు జిల్లా ఆసుపత్రులకు పంపిస్తారని వైద్యాశాఖ అధికారి తెలిపారు. ఇప్పటికే జిల్లాకో మెడికల్ కాలేజీ.. ప్రభుత్వాసుపత్రి.. నియోజకవర్గానికో ఆసుపత్రి .. డయాలిసిస్ కేంద్రాన్ని గత ప్రభుత్వం నిర్మించిన నేపథ్యంలో వాటిని త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చూస్తుంది.