Cancel Preloader

‘”హైడ్రా”‘ కూల్చివేతలు అన్ని ఒకే … కానీ…?- ఎడిటోరియల్ కాలమ్

 ‘”హైడ్రా”‘ కూల్చివేతలు అన్ని ఒకే … కానీ…?- ఎడిటోరియల్ కాలమ్

HYDRA

వర్షకాలం వచ్చిన వరదలోచ్చిన హైదరాబాద్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది రోడ్లపై వరదనీళ్ళు… నిండా మునిగిన కాలనీలు… పొంగిపోర్లే నాలాలు.. ఇండ్లలోకి వచ్చే వరద నీళ్లు.. ఇవే సంఘటనలు మన కండ్లకు దర్శనమిస్తాయి. అధికారక లెక్కల ప్రకారం హైదరాబాద్ మహానగరం చుట్టూ దాదాపు 1000-1500చెరువులున్నట్లు అంచనా.. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉండే హుస్సేన్ సాగర్ (ట్యాంక్ బండ్)వరదలోచ్చినప్పుడు.. భారీ వర్షాలు వచ్చినప్పుడు అటు దిక్కు పోవాలంటేనే ఏదో సందేహాం. అలాంటి పరిస్థితులున్న హైదరాబాద్ మహనగరంలో అక్రమణలకు గురైన చెరువులను… విలువైన ప్రభుత్వ భూములను పరిరక్షించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మార్చి నెలలో ప్రారంభించిన వ్యవస్థ “హైడ్రా”. మంచి నిఖార్సైన .. నిజాయితీ పట్టుదల శ్రమకు గుర్తింపుగా నిలిచిన ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ ను హైడ్రా కమీషనర్ గా నియమించింది ప్రభుత్వం. నియామకం అయిన తెల్లారే బాధ్యతలు స్వీకరించిన అతికొద్ది కాలంలోనే తన మార్కును చూపించారు రంగనాథ్.

కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు సోదరుడు అనంద్ కు చెందిన స్పోర్ట్ విలేజ్ కూల్చి వేత దగ్గర నుండి సినీ హీరో నాగార్జున కు చెందిన ఎన్ కన్వేషన్ వరకు.. సామాన్యుల దగ్గర నుండి సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి చెందిన ఇంటికి నోటీసులు ఇవ్వడం వరకు అంతా బాగానే ఉంది.. కబ్జాలకు ఆక్రమణలకు గురైన చెరువులతో పాటు విలువైన ప్రభుత్వ భూములను పరిరక్షిస్తారంటే సామాన్యుల దగ్గర నుండి సెలబ్రేటీల వరకు ఎవరూ కాదనరు. అడ్డు కూడా చెప్పరు.. పైకి మద్ధతు కూడా ఇస్తారు. అందుకే ఇటీవల కొంతమంది హైడ్రా కు మద్ధతుగా ర్యాలీలు కూడా నిర్వహించారు కూడా.. ఇంతవరకు అంతా బాగానే ఉంది కానీ ..?. ఈ కానీ కానీ ఏంటి అని ఆలోచిస్తున్నారా..?. అయితే కొంచెం వివరంగా వెళ్దాం.. హైడ్రా యొక్క ముఖ్య ఉద్ధేశ్యం ఏంటి ” బఫర్ ,FTL జోన్ల పరిధిలో ఉన్న అక్రమణ నిర్మాణాలను ,కట్టడాలను కూల్చివేసి చెరువులను,నాలాలను,విలువైన ప్రభుత్వ భూములను పరిరక్షించడం..

కానీ హైడ్రా సామాన్యుల నుండి సెలబ్రేటీల వరకు ఒకేవిధంగా వ్యవహరిస్తుందా..?.. సామాన్యులకు అయితే అనుకున్నదే తడవుగా నోటీసులు ఇచ్చిన తెల్లారే రాత్రికి రాత్రికి వెళ్లి కూల్చివేతలు. అదే సెలబ్రేటీలు అయితే మాత్రం నెల రోజులు గడవు ఇవ్వడమే కాదు మీకు మీరే కూల్చివేయాలి.. లేదంటే మేమే వచ్చి నెల రోజుల తర్వాత కూల్చివేస్తామని ఆదేశాలు ఇవ్వడం.. ఇది ఎంతవరకు కరెక్టు అని ప్రతిపక్ష బీఆర్ఎస్ నుండి సీపీఐ ,బీజేపీ నేతల వరకు అందరూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సమాధానం లేని ప్రశ్న.. హైడ్రాకు మేము వ్యతిరేకం కాదు.. అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేయాలి అని బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రులు కేటీఆర్,తన్నీరు హారీష్ రావు మొదలు బీజేపీ కి చెందిన ఎంపీలు ఈటల,డీకే అరుణ,కేంద్ర మంత్రులు బండి సంజయ్,కిషన్ రెడ్డి,సీపీఐ ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు,నేత నారాయణ,ఎంఐఎం నేతలు అక్బరుద్ధీన్,అసద్ధుద్ధీన్ ఓవైసీ తదితరులు ఒకవైపు మద్ధతు ఇస్తూనే మరోవైపు అన్యాయంగా అక్రమంగా సామాన్యులను రోడ్డున పడేయద్దు అని వారి డిమాండ్.

ఈ డిమాండ్ న్యాయం అయిందే కావోచ్చు కానీ ముందు బఫర్ ,FTL జోన్ల పరిధిలో నిర్మాణాలను అనుమతులు ఇవ్వడం ఎందుకు..?.. తీరా కట్టుకున్న తర్వాత అదే అనుమతులు అక్రమం.. భూములను కబ్జా చేశారని కూల్చివేయడం ఎందుకు ..? అని సగటు సామాన్యుడ్ని తొలిచే అనుమానం. ఈ అనుమానం పెద్ద పెనుభూతంగా మారకుండా అవినీతి అక్రమాలకు పాల్పడి వీటి పరిధిలో నిర్మాణాలకు కట్టడాలకు అనుమతులు జారీ చేసిన ఆరుగురు అధికారులపై కొరడా కూడా ఝులిపించింది. ఇది ఒకే కానీ హైడ్రా పరిధిలో కూల్చివేతలు జరిగే సమయంలో ఎవరికి అన్యాయం జరగకుండా నియమాలకు అనుగుణంగా నడుచుకోవాలని హైకోర్టు కూడా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో హైడ్రా కూల్చివేతలు ఒకే కానీ ఆ కూల్చివేతల వల్ల ఎవరూ ముఖ్యంగా సామాన్యులు,పేదలు నష్టపోకుండా ఉంటే చాలు అని ఇటు ప్రతిపక్షాలు అటు విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ఒక వందమంది దోషి తప్పించుకున్న పర్వాలేదు కానీ ఒక నిర్ధోషి కి కూడా శిక్ష పడకూడదని మన ఇండియన్ ఫీనల్ కోడ్ లో మెయిన్ టాఫిక్. అందుకే హైడ్రా కూల్చివేతల వల్ల ఏ ఒక్కర్కి అన్యాయం జరగకుండా చూసుకుంటే రాబోయే రోజుల్లో ” హైడ్రా”ను చరిత్రలో లిఖిస్తారు ఇప్పటి రాబోవు తరాలు..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *