హైడ్రా దూకుడు-6గురు అధికారులపై కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని చెరువులు,కుంటలు,ప్రభుత్వ భూముల పరిరక్షణకై ఏర్పాటైన “హైడ్రా” దూకుడు పెంచింది. ఇందులో భాగంగా గతంలో FTL,బఫర్ జోన్ల నియమాలకు విరుద్ధంగా నిర్మాణాలకు,కట్టడాలకు అనుమతిచ్చిన జీహెచ్ఎంసీ అధికారులపై చర్యలకు పూనుకుంది.
ఈ క్రమంలోనే ఆరుగురు అధికారులపై కేసులను నమోదు చేసింది. నిజాంపేట మున్సిపల్ కమీషనర్,చందానగర్ మున్సిపల్ డిప్యూటీ కమీషనర్,హెచ్ఎండీఏ ఏపీఓ,బాచుపల్లి తహశీల్దార్,మేడ్చల్ జిల్లా సర్వే అధికారి ఇలా ఆరుగురిపై ఆర్ధిక నేర విభాగం(ఈఏఓ)లో పిర్యాదు చేసింది.
వీరంతా నియమాలకు విరుద్ధంగా నిర్మాణాలకు,కట్టడాలను అనుమతులు ఇచ్చారని తెలుస్తుంది.ఇప్పటికే హీరో నాగార్జున దగ్గర నుండి కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు సోదరుడు ఆనంద్ వరకు అందర్ని వదిలిపెట్టకుండా నిర్మించిన అక్రమ కట్టడాలు. నిర్మాణాలపై కొరడా చూపిస్తుంది హైడ్రా.