ప్రజలకు,కార్యకర్తలకు అండగా ఉంటాను

RK ROJA Ap Former Minister
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం మాజీ మంత్రి.. నగరి అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మీడియా సమావేశంలో మాట్లాడుతూ ” గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీంటిని ఐదేండ్ల అధికారంలో ఉన్న సమయంలో నెరవేర్చాను..
నలబై నుండి యాబై ఏండ్లు ఎమ్మెల్యేగా.. అధికారంలో ఉండి సైతం అమలు చేయని కొంతమందిలా కాకుండా ఐదేండ్లలోనే నగరిని అన్ని విధాలుగా అభివృద్ధి చేశాను.
ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చాను. అధికారంలో ఉన్న లేకపోయిన.. పదవిలో ఉన్న లేకపోయిన నిత్యం ప్రజలకు కార్యకర్తలకు అండగా ఉంటాను. ఎప్పుడు సమస్య అని నా ఇంటి తలుపు తట్టిన వారికి నేను భరోసానిచ్చి ధైర్యంగా ఆ సమస్యను పరిష్కరిస్తానని” అన్నారు.