రాజీనామాల చరిత్ర నాది.. రైపిల్ పట్టుకున్న చరిత్ర నీది- మాజీ మంత్రి హారీష్ రావు

 రాజీనామాల చరిత్ర నాది.. రైపిల్ పట్టుకున్న చరిత్ర నీది- మాజీ మంత్రి హారీష్ రావు

former minister thanneeru harish rao

తెలంగాణ రాష్ట్ర సాధనలో పలుమార్లు ఎమ్మెల్యే.. మంత్రి పదవులకు రాజీనామా చేసిన చరిత్ర నాది. పదవులకు రాజీనామా చేయమంటే ఉద్యమకారులపైకి రైపిల్ పట్టుకుని వెళ్లిన చరిత్ర మీది అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు విరుచుకుపడ్డారు. తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది మీరు కాదా..?.

రాష్ట్రంలో ఉన్న 47లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయడానికి రూ.40,000కోట్లు అవసరం అని ఎన్నికల ప్రచారంలో ఊకదంపుడు ప్రసంగాలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరా అధికారంలోకి వచ్చాక కేవలం 22లక్షల మంది రైతులకు రూ.17,000కోట్ల రుణమాఫీ చేసి 46% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారు. రైతులందరికీ రుణమాఫీ కాలేదు అని నేను నిరూపిస్తాను..

ప్లేస్ డేట్ మీరు చెప్పిన ఒకే.. నియోజకవర్గాన్ని మీరు చెప్పిన ఒకే.. రైతుల మధ్యనే చర్చకు నేను సిద్ధం.. రుణమాఫీ మొత్తానికి అయితే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. చేయకపోతే మీరు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా..?. రంకెలు వేస్తే అబద్ధాలు నిజాలు కావు.. అన్ని మతాల దేవుళ్లపై ఒట్లు వేసి మాట తప్పారు. నేను దేవుళ్ల అందరి దగ్గరకు వెళ్లి తెలంగాణ సమాజం పట్ల దయ చూపమని మొక్కుతాను అని ఆయన అన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *