రేవంత్ రెడ్డికి హారీష్ రావు సవాల్
తెలంగాణలో ప్రతి రైతుకు రూ.2,00,000ల రుణమాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు మాటలు చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక రుణమాఫీకి ఏగనామం పెట్టారు అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు విమర్శించారు. తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” డిసెంబర్ 9 తారీఖున రూ.40,000కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పారు.
క్యాబినెట్ మీటింగ్ లో రూ.31000కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పారు. అఖర్కి బడ్జెట్ లో రూ.26,000కోట్లే పెట్టారు. చివరికి 17000కోట్ల రూపాయలతో 47లక్షల మంది రైతులకు చేయాల్సింది కేవలం 22లక్షల మంది రైతులకే రుణమాఫీ చేశారు. కేవలం 46% మంది రైతులకే రుణమాఫీ అయింది.25లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదు.
రుణమాఫీ కథ పంచ పాండవుల్లా ఉంది. పాక్షికంగానే రుణమాఫీ చేశామని ఒప్పుకుని రైతాంగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు. మా హాయాంలో 36,00,000మంది రైతులకు రుణమాఫీ చేశాము. ముఖ్యమంత్రి నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఆ సీటుకు ఉన్న గౌరవం మర్యాద పోతుంది.. రైతురుణమాఫీపై రైతుల మధ్యనే చర్చకు సిద్ధం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చకు సిద్ధమా అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు తెలంగాణ భవన్ సాక్షిగా సవాల్ విసిరారు.