బీఆర్ఎస్ పాలనలో 7 లక్షల కోట్ల అప్పులు
బీఆర్ఎస్ పాలనలో ఏడు లక్షల కోట్ల అప్పులు అయ్యాయి అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పెద్దపల్లి కాల్వ శ్రీరాంపూర్ లో జరిగిన కార్యక్రమంలో మంత్రులు తుమ్మల,శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్,ఎంపీ గడ్డం వంశీ పాల్గోన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ” బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఏడు లక్షల కోట్ల అప్పులు పాలైన కానీ ఒకే విడతలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది. గతంలో బీఆర్ఎస్ నాలుగైదు విడతలుగా చేస్తే మేము ఒకేసారి చేస్తున్నాము.
ఆగస్టు ఫిఫ్టీన్ లోపు రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ఆయన ఉద్ఘాటించారు. గతంలో కూడా రుణమాఫీ చేసిన ఘనత తమదే .. కాంగ్రెస్ అంటే రైతుపక్షపాతి అని ఆయన తెలిపారు.