36 సార్లు ఢిల్లీకెళ్ళిన పైసా లాభం లేదు..!

Ministers.. MLA.. MPs.. who do not count CM Revanth Reddy..!
ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి గత పద్నాలుగు నెలల్లో 36 సార్లు ఢిల్లీకి వెళ్ళిన మొత్తంగా కేంద్ర సర్కారు నుండి మూడు రూపాయలు తీసుకురాలేదని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై ఫైరయ్యారు.
ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందిస్తూ “SLBC ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకుంటే ఎన్నికల ప్రచారంలో మునిగితేలారని ఆయన దుయ్యబట్టారు. దాదాపు 96 గంటలు దాటినా ముందడుగు వేయడం లేదని కేటీఆర్ రేవంత్ రెడ్డిని దుయ్యబట్టారు.
కాళేశ్వరం పగుళ్లు, శ్రీశైలం అగ్నిప్రమాదంపై కారుకూతలు కూసిన మేధావులు SLBC విషయంలో మాత్రం నోరెత్తడం లేదని ఆయన విమర్శించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు.
