మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చనిపోయిన రోజు అసలు ఏమి జరిగింది..?
అఖండ భారతావని మాజీ ప్రధానంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి నేడు. సరిగ్గా ఇరవై మూడు ఏండ్ల కిందట అంటే 1991 మే 21న తమిళనాడు రాష్ట్రంలోని శ్రీపెరంబుదూర్లో ఆయనను ఎల్టీటీఈ సభ్యులు బెల్ట్ బాంబుతో చంపారు.
ఆ రోజు 22 ఏళ్ల ఓ యువతి రాజీవ్ మెడలో దండ వేసి, పాదాలను తాకారు. అనంతరం ఆ యువతి ముందుకు వంగి బాంబును పేల్చారు.
దీంతో అక్కడ ఉన్నవారి చెవులు సైతం చిల్లులు పడేలా పెద్ద శబ్దంతోపాటు పొగ బెలూన్ లతో పైకి లేచింది. రెప్పపాటులో రాజీవ్ శరీరం ముక్కలు ముక్కలుగా ఎగిరి పోయింది. ఈ ఘటనలో రాజీవ్ అక్కడికక్కడే మరణించారు.