మంత్రి లోకేశ్ పై వైసీపీ పరుష పదజాలం

Lokesh as Deputy CM..!
ఏపీ మంత్రి నారా లోకేష్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ భారీ వర్షాలు కురవడంతో ఎదురైన వరదలతో జనం ఇబ్బందుల్లో ఉంటే జగన్ తన ప్యాలెస్ లో విశ్రాంతి తీస్కుంటున్నారు.. బురద రాజకీయాలకి బ్రాండ్ అంబాసిడర్ గా జగన్ మారారని ఆయన దుయ్యబట్టారు.
పాస్ పోర్టు సమస్య అనేది లేకుంటే ఎప్పుడో లండన్ వెళ్లేవారు. గత వైసీపీ ప్రభుత్వం బుడమేరు పనులను నిలిపివేసి ఈ విపత్తుకు కారణమైందని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ తమ ట్విట్టర్ హ్యాండిల్ లో పరుష పదజాలంతో రిప్లయ్ ఇచ్చింది..ఎక్స్ లో మంత్రి లోకేష్ ను కోట్ చేస్తూ “సిగ్గుందా లోకేశ్? నిన్న కూడా స్పెషల్ ప్లైట్ లో హైదరాబాద్ వెళ్లి వచ్చావ్.
నీకు ప్రజల గురించి పట్టింపు ఉందా? బజారు భాషను ప్రవేశపెట్టి రెడ్ బుక్ అంటూ ఎర్రి బుక్కు పాలన చేస్తున్న నువ్వు జగన్ ను నిందించడం విడ్డూరం’ అని దుయ్యబట్టింది. వరదలపై రెవెన్యూ సెక్రటరీ, ఇరిగేషన్ ఇంజినీర్, కలెక్టర్ మాట్లాడిన వీడియోను అందులో షేర్ చేసింది.