టీడీపీ సానుభూతిపరులపై వైసీపీ నేతల దాడి
ఏపీలో నిన్న మొన్నటి వరకు తమ పార్టీకి చెందిన కార్యకర్తలు,నేతలు,సానుభూతిపరులపై అధికార టీడీపీకి చెందిన నేతలు దాడులు చేస్తున్నారు.. నలబై ఐదు రోజుల్లో దాదాపు 300 కి పైగా దాడులు జరిగాయి.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని వైసీపీ అధినేత..మాజీ సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏకంగా ఢిల్లీలో ధర్నా కూడా జరిగింది..ఈ ధర్నాకు జాతీయ పార్టీలు చాలా పాల్గోన్నాయి కూడా.. అయితే తాజాగా ఏపీలో టీడీపీ సానుభూతిపరులపై వైసీపీ నేతలు దాడి చేసి గాయపరిచిన ఘటన తొట్టంబేడు మండలంలోని కొత్తకండ్రిగ గ్రామంలో నిన్న ఆదివారం జరిగింది.
ఎస్‌ఐ రాజేంద్ర తెలిపిన వివరాల మేరకు.. కొత్తకండ్రిగ గ్రామంలో టీడీపీకి చెందిన సురేష్, వైసీపీకి చెందిన విజయకుమార్ మధ్య పాత కక్షలు ఉన్నాయి. ఇటీవల ఎన్నికల సమయంలో ఇరువురి మధ్య మళ్లీ విభేదాలు తలెత్తాయి. ఆదివారం సురేష్, విజయకుమార్ మధ్య మాటా మాట పెరిగి వివాదానికి దారి తీసింది. ఆగ్రహించిన విజయకుమార్ తన బాబాయి బాబు, తమ్ముడు గురునాధంతో కలిసి కర్రలతో టీడీపీ సానుభూతిపరుడైన సురేష్ ఇంటిపై దాడి చేశారు.
ఈ ఘటనలో సురే్‌షతోపాటు అతని భార్య షర్మిల, బావ రాజా, మామ వెంకటయ్య గాయపడ్డారు.క్షతగాత్రులు చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి ప్రభుత్వాఆస్పత్రిలో చేరారు. ఎస్‌ఐ రాజేంద్ర ఆస్పత్రికి చేరుకుని బాధితులతో మాట్లాడా రు. వారి ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.