కాళ్ళు మొక్కించుకున్న టీడీపీ ఎమ్మెల్యే -వీడియో వైరల్
ఏపీ అధికార టీడీపీ కి చెందిన డోన్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని ప్రతిపక్ష పార్టీ వైసీపీ విమర్శించింది.
ఓ పంచాయితీ పేరుతో ఇద్దరు యువకులతో కాళ్లు మొక్కించుకుని వారిని దూషిస్తూ కర్రతో దండించారని ఎమ్మెల్యే సూర్య ప్రకాష్ రెడ్డికి సంబంధించిన ఓ వీడియోని తన అధికారక ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసింది.
ఇలా అయితే ఇక పోలీసులు ఎందుకు… న్యాయస్థానాలు ఎందుకు అని వైసీపీ ప్రశ్నించింది. ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు, ఏ విషయంపై జరిగిందనేది తెలియాల్సి ఉంది.