టీడీపీ పై వైసీపీ కి చిక్కిన బ్రహ్మాస్త్రం
ఏపీ అధికార టీడీపీ పై పోరాటానికి ఏ చిన్న అవకాశం దొరికిన వైసీపీ అసలు వదిలిపెట్టడం లేదు. అధికారంలోకి వచ్చిన నలబై ఐదు రోజులకే రాష్ట్రంలో శాంతిభద్రతలు కుచించిపోయాయి. రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల దగ్గర నుండి సామాన్యుల వరకు ఎవరికి రక్షణ లేకుండా పోతుంది.. ఈనలబై ఐదు రోజుల్లో నాలుగోందల మందిపై దాడులు జరిగాయి. నలబై మంది చనిపోయారు ఈ దాడుల్లో అని ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలో సేవ్ ఆంధ్రా పేరుతో ఏకంగా ధర్నాలుకు దిగింది..ఈ ధర్నాకు జాతీయ స్థాయిలో ఇటు మీడియా కవరైజ్.. అటు జాతీయ నాయకుల మద్ధతు లభించింది. రాష్ట్రంలో కూడా వైసీపీ క్యాడర్ లో జోష్ తో పాటు జనాధరణ మళ్లీ పెరిగింది.
తాజాగా మరో బ్రహ్మాస్త్రం లాంటి ఓ అవకాశం వైసీపీ ముందట నిలిచింది. అదే వైజాగ్ ఉక్కు పరిశ్రమ. ఈ స్టీల్ ప్లాంట్ ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడానికి పావులు కదుపుతుంది. అందులో భాగంగా ఉక్కు సంబంధిత శాఖ మంత్రులు కుమారస్వామి,శ్రీనివాస వర్మ లు పలుమార్లు వైజాగ్ కు వచ్చి సమీక్ష సమావేశాలు నిర్వహించారు. తాజాగా ప్రైవేటీకరణ ఖాయం అని భావించి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ధర్నాలకు దిగారు. ఈ ధర్నాకు పలు రాజకీయ పార్టీల నుండి ప్రజల నుండి అన్ని అవర్గాల వారీ నుండి మద్ధతు లభిస్తుంది. ఏకంగా టీడీపీ అధ్యక్షుడు అయిన పల్లా శ్రీనివాస్ యాదవ్, ఆ ప్లాంట్ ఉన్న గాజువాక శాసనసభ్యులు కావడంతో తప్పనిసరిగా మద్ధతు తెలపాల్సి వచ్చింది.
ఇందులో భాగంగా పల్లా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడూతూ ” ప్రైవేటీకరణను అడ్డుకుంటాము.. లేని పక్షంలో తమ పదవులకు రాజీనామా చేస్తామని వెనక ముందు ఆలోచించకుండా హామీ ఇచ్చేశారు. ఇక్కడే వైసీపీకి అవకాశం చిక్కింది. గతంలో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేవరకు టీడీపీ ఉక్కు ప్లాంట్ పై పోరాడి టీడీపీ వైసీపీని కార్నర్ చేసింది.
తాజా అంశంతో వైసీపీ వైజాగ్ పరిధిలోని ఎమ్మెల్యేలంతా తమ పదవులకు రాజీనామా చేసి ప్రైవేటీకరణను అడ్డుకోవాలని పోరాటాలను ఉదృతం చేస్తుంది. ప్రైవేటీకరణ జరగకపోతే టీడీపీ సేఫ్.. లేకపోతే మాత్రం టీడీపీ తో పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ,ఏకంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ పదవులకు ఇటు ఎమ్మెల్యే అటు అధ్యక్ష పదవికి ఎసరు వచ్చేలా ఉంది. వైసీపీ బ్రహ్మాస్త్రం తో ఇటు వైజాగ్ టీడీపీ ప్రజాప్రతినిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని సైతం ఊపిరి పీల్చుకోకుండా చేసింది. చూడాలి మరి ఇది ఎక్కడదాక వెళ్తుందో..?