బాబు పాలనలో ఆడవాళ్లకు లేని రక్షణ

 బాబు పాలనలో ఆడవాళ్లకు లేని రక్షణ

Chandrababu andhrapradesh CM

Loading

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధికార ప్రతినిధి .. ప్రముఖ యాంకర్ శ్యామల విరుచుకుపడ్డారు. గత మూడున్నర నెలల కూటమి పాలనలో ఆడవాళ్లపై జరిగిన అఘాత్యల గురించి వివరిస్తూ ఓ వీడియోలో ఆమె విరుచుకుపడ్డారు.

ఆ వీడియో లో మాట్లాడుతూ ” రాష్ట్రంలో చెడు రాజకీయాల మాని మహిళల మానప్రాణాలకు రక్షణ కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును ఆమె కోరారు. నిండు పున్నమి లాంటి రాష్ట్రాన్ని అమావాస్య చీకటిగా మార్చారని నిప్పులు చెరిగారు.

సీఎం సొంత జిల్లాలో చిన్నారులు, మహిళలపై అఘాత్యాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఆపద వస్తే అన్నయ్యలా అండగా ఉంటానని సినిమా డైలాగులతో అధికారంలోకి రావడానికి ఊదరగొట్టిన కూటమి పార్టీ నేతలు అధికారంలోకి వచ్చాక ఎక్కడున్నారు అని మండిపడ్డారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *