హారీష్ రావు ఒక్క ప్రెస్ మీట్ తో దిగోచ్చిన సర్కార్

నూతన రేషన్ కార్డుల జారీ విషయంలో కాంగ్రేస్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాలు ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నాయని,మాజీ మంత్రి ,సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని నిలదీసారు..కుల గణనను ప్రాతిపదికగా తీసుకుని రేషన్ కార్డులు జారీ చేస్తామన్న ప్రభుత్వ మార్గదర్శకాలను హరీష్ రావు తప్పుబట్టారు.
నిబందనలతో రేషన్ కార్డులను ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు..ప్రెస్మీట్ పూర్తైన కొద్దిసేపటికే ప్రభుత్వం స్పందించింది.హరీశ్ రావు చేసిన వాఖ్యలతో సర్కారు దిగొచ్చింది..వెంటనే ముగ్గురు మంత్రులు రేషన్ కార్డులపై సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసారు..మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,తుమ్మల నాగేశ్వర్ రావు లు సమీక్ష నిర్వహించి రేషన్ కార్డులు అర్హులైన ప్రతీ ఒక్కరికి అందజేయాలని,ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని వారు ప్రకటన చేసి కొత్త మార్గదర్శకాలు విడుదల చేసారు..
హరీశ్ రావు ప్రెస్ మీట్ లో ప్రస్తావించిన ప్రతీ అంశంపై మంత్రులు వివరణ ఇచ్చారు.హరీశ్ రావు దెబ్బకు సర్కారు దిగొచ్చిందని గ్రామాల్లో రచ్చబండల వద్ద చర్చించుకుంటున్నారు.
