KCR మౌనం ఎందుకు…?-ఎడిటోరియల్ కాలమ్

 KCR మౌనం ఎందుకు…?-ఎడిటోరియల్ కాలమ్

KCR Telangana State First CM

తెలంగాణ సార్వత్రిక ఎన్నికలై పది నెలలు కావోస్తుంది.. అధికార పార్టీగా కాంగ్రెస్ కు… ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ను ప్రజలు కూర్చోబెట్టారు.. ఎన్నికల సమయంలో ఇరు పార్టీలకు చెందిన నేతలు ఎన్నెన్నో హామీలిచ్చారు.. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే నాడు గెలిచిన తర్వాత డిసెంబర్ తొమ్మిదో తారీఖున రెండు లక్షల రుణమాఫీ చేస్తాము.. తొలి క్యాబినెట్.. అసెంబ్లీ సమావేశాల్లోనే ఆరు గ్యారంటీలకు చట్ట భద్రత తీసుకోస్తాము.. ఆసరా నాలుగు వేలు ఇస్తాము.. రైతుభరోసా కింద పదిహేను వేలిస్తాము.. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగోందల ఇరవై హామీలను కురిపించారు. మరోవైపు బీఆర్ఎస్ కూడా హామీలనిచ్చింది. కానీ ప్రజలు బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ నే నమ్మారు.. మార్పు అని కోరుకుంటూ హాస్తం పార్టీని ప్రజాభవన్ కు పంపింది.

ఇంతవరకూ బాగానే ఉంది. కానీ ప్రధాన ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల్లో ఉన్నది.. ప్రజల సమస్యలపై కొట్లాడింది తక్కువనే మాట కాదు అసలు ప్రజాక్షేత్రంలోకే అడుగు పెట్టలేదు.. అప్పుడెప్పుడో వరదల సమయంలో ఖమ్మం ,నల్గోండ జిల్లా రైతాంగాన్ని పరామర్శించడం .. మొన్నా మధ్య అసెంబ్లీలో ఒకరోజు ప్రత్యేక్షమవ్వడం తప్పా ఎక్కడ కూడా కేసీఆర్ కన్పించింది లేదు..ఎన్నికల సమయంలో చిన్న పిల్లాడికి అరటి పండు తొక్క తీసి ఆకాశంలో చంద్రుడ్ని చూపించి తిన్పించినట్లు కేసీఆర్ కాంగ్రెస్ ను నమ్మోద్దు. అరవై ఏండ్ల గోసకు కారణం వాళ్ళే.. మళ్లీ వాళ్లను నమ్మితే ఆగమవుతారు అని పూస గుచ్చినట్లు పదేండ్ల పాటు తాము చేసిన సంక్షేమాభివృద్ధి కంటే కాంగ్రెస్ వస్తే జరిగే నష్టాల గురించే ఎక్కువగా చెప్పారు. అయిన కానీ ప్రజలు విశ్వసించలేదు.. కాంగ్రెస్ ను గెలిపించారనే ఆవేదన ఇంకా కేసీఆర్ లో ఉన్నట్లు ఉంది. అనకూడదు కానీ చెబితే విననోడ్ని చెడంగ చూడాలని పెద్దలు చెబుతుంటారు. ఈ విషయం తెలంగాణ ప్రజల విషయంలో నిజమైంది.. పాలిచ్చే ఆవును వద్దనుకుని పాలివ్వని దున్నపోతును కొన్నట్లైంది అని రాజకీయ విమర్శలు అభిప్రాయం..

అయితే ఎన్నికలప్పుడు గెలుపోటములు సహాజం కానీ కేసీఆర్ ఇలా బయటకు రాకపోవడం ఏంటని రాజకీయ వర్గాల్లో పాటు సామాన్యుల మదిలో తలెత్తుతున్న కోటి రూపాయల ప్రశ్న.. కేసీఆర్ బయటకు రాకపోవడానికి ఓ బలమైన కారణమే ఉండోచ్చు అని గులాబీ శ్రేణుల అభిప్రాయం.. ఎందుకంటే ఎంపీ ఎన్నికల సమయంలో కూడా బీఆర్ఎస్ కు పది నుండి పన్నెండు సీట్లు ఇవ్వండి.. కేంద్రంలో చక్రం తిప్పుతాము.. రేపటి ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కీలకం కాబోతున్నాయి అని కూడా కేసీఆర్ ప్రతి సభలో చెప్పారు. అయిన కానీ ఓటర్లు సున్నాకు పరిమితం చేశారు. పక్కనున్న టీడీపీ, బీహార్ లోని జేడీయూ కీలకమయ్యాయి కేసీఆర్ అన్నట్లు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో.. అసెంబ్లీ ఎన్నికలప్పుడు వినకపాయే.. ఎంపీ ఎన్నికలప్పుడు వినకపాయే.. కానీ ఏదైన అనుభవమైతేనే తప్పా సోయి రాదనే వాదనను నమ్మినట్లు కేసీఆర్ ప్రజలకు చీకటి వచ్చినప్పుడు వెలుగు యొక్క గొప్పతనం ఆర్ధమవుతుందన్నట్లు కాంగ్రెస్ పాలన చూశాకే ప్రజలకు పదేండ్లు ఎలా ఉన్నామనే సోయి వస్తాదేమో అని అనుకుంటున్నట్లు టాక్.

అయితే కేసీఆర్ ఏమి గమ్మున లేడు.. బీఆర్ఎస్ మాజీ మంత్రులు హారీష్ రావు, కేటీఆర్ నేతృత్వంలోని గులాబీ దళానికి ఎప్పటికప్పుడూ సూచనలు .. సలహాలు ఇస్తూనే యాక్షన్ ప్లాన్ ను అమలు చేస్తున్నారు. అయితే ఎవరు ఎన్ని చేసిన కేసీఆర్ ఓ ప్రధాన ప్రతిపక్ష లీడర్ గా జనాల్లోకి రావాలి కదా.. హైడ్రాతో అంత ఇబ్బందులు పడుతున్న హైదరాబాద్ ప్రజల కోసమైన రావాలి కదా అని అనుకోవచ్చు.. హైడ్రా వల్ల ఇబ్బందులు పడుతున్నారనే కోర్టులకు కూడా వెళ్తాం… హైడ్రా బాధితులకు అండగా ఉంటామని కేటీఆర్ హారీష్ రావులాంటి నేతలు మీడియా సమావేశంలో చెబుతున్నారు.. తాను ఫామ్ హౌజ్ లో ఉన్న నందినగర్ లో ఉన్న కానీ తెలంగాణ ప్రజలకు కష్టం వస్తే కేటీఆర్, హారీష్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ దళం రూపంలో కేసీఆర్ వారికి అండగా ఉంటున్నారు..

కేసీఆర్ మనిషి ఫామ్ హౌజ్ .. మనసు మాత్రం తెలంగాణ సమాజం గురించే ఆలోచిస్తుందని తెలంగాణ భవన్ లో గుసగుసలు.. వేడితో ఉన్నప్పుడే సుత్తితో కొడితే పదునెక్కుతుందన్నట్లు.. ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది.. అందుకే దసరా తర్వాత స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దసరాకు ఒక రోజు ముందు ఆయుధ పూజ చేసి రాముడు రావణుడ్ని వధించినట్లు ఆ పండుగ తర్వాత కేసీఆర్ జనక్షేత్రంలోకి దిగి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పతనాన్ని ప్రారంభిస్తాడు.. చివరగా సార్వత్రిక ఎన్నికల వరకు పూర్తి చేయడానికి పూనుకుంటారని గులాబీ దళం వాదన.. సో దసరా తర్వాత కేసీఆర్ జనాలకు అందుబాటులో ఉంటరా. మరి కొంతకాలం వేచి చూస్తారా అని చూడాలి మరి..!

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *