బండి సంజయ్ అంత ఆత్రం ఎందుకు…?
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి బీజేపీ తరపున రెండో సారి ఎంపీగా గెలుపొందిన బండి సంజయ్ కుమార్ కేంద్ర హోం శాఖ సహాయక మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి నేటి వరకు కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎన్ని ఇబ్బందులను ఎదుర్కుంటున్న ఏనాడు కనీసం స్పందించలేదు.
రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు.. ఫుడ్ ఫాయిజన్ సంఘటనలు.. నిరుద్యోగ యువత రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు.. రైతుబంధు.. రైతు రుణమాఫీపై రైతులు చేపట్టిన ధర్నాలు.. రాస్తోరోకుల గురించి కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ కనీసం ప్రశ్నించలేదు. అఖరికి తాజాగా హైడ్రాతో మూసీ పరివాహక ప్రాంత పేదలు నడిరోడ్డుపైకి వచ్చి తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ వన్ అభ్యర్థులు ఆశోక్ నగర్ లో ఆర్ధరాత్రి సైతం ధర్నాలు చేశారు.
అయిన స్పందించని కేంద్ర మంత్రి కేటీఆర్ & బీఆర్ఎస్ నేతలకు సంబంధించి ఏ చిన్న సంఘటన జరిగిన కానీ మీడియా ముందుకు వస్తున్నారు. తప్పు చేస్తే స్పందించిన పర్వాలేదు కానీ కాంగ్రెస్ పార్టీకి మద్ధతుగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మద్ధతుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్న బండి సంజయ్ కుమార్ తాజాగా జన్వాడ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ లేవు.. కేవలం అనుమతి లేదనే కేసులు పెట్టామని పోలీసు అధికారులు చెబుతున్న పదే పదే డ్రగ్స్ ఉంది.. కేటీఆర్ బామ్మర్ధిని తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ పార్టీలో కేటీఆర్ అక్కడే ఉన్నాడని చెప్పడంలో అంత ఆత్రం ఎందుకు అని బీఆర్ఎస్ శ్రేణులు.. మేధావులు విరుచుకుపడుతున్నారు.