మహారాష్ట్ర లో గెలుపు ఎవరిదీ?-ఎగ్జిట్ పోల్స్
మహారాష్ట్రలో మహాయుతి కూటమి మళ్లీ అధికారంలోకి వస్తుందని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. బీజేపీ, శివసేన, ఎన్సీపీ నేతృత్వంలోని ఈ కూటమికి 175-196 సీట్లు వస్తాయని తెలిపింది.
కాంగ్రెస్, ఎన్సీపీ ఎస్పీ , ఎస్ఎస్ యూబీటీ నాయకత్వంలోని ఎంవీఏ కు 85-112 సీట్లు వస్తాయని పేర్కొంది.
బీజేపీకి 113, శివసేనకు 52, ఎన్సీపీకి 17 సీట్లు సొంతంగా వస్తాయంది. కాంగ్రెస్ 35, శరద్ పవార్ పార్టీకి 35, ఉద్ధవ్ సేనకు 27 సీట్లు వస్తాయని తెలిపింది.
మరోవైపు బీజేపీ కూటమిదే అధికారమని ఏబీపీ సర్వే సైతం వెల్లడించింది. మొత్తం 288 సీట్లకుగాను బీజేపీ+శివసేన+ఎన్సీపీ 150-170, కాంగ్రెస్ + ఎన్సీపీ(ఎస్పీ) + ఎస్ఎస్ యూబీటీ 110-130 , 08-10 సీట్లు గెలుస్తాయని అంచనా వేసింది. బీజేపీ 89-101 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని తెలిపింది.
ఇంకోవైపు మహాయుతి అత్యధిక సీట్లు గెలుస్తుందని పీమార్క్ సర్వే కూడా అంచనా వేసింది. మహాయుతికి 137-157 సీట్లు వస్తాయని తెలిపింది. ఎంవీయేకు 126-146 సీట్లు రావొచ్చని అంచనా వేసింది. మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్ సైతం మహాయుతికే అనుకూలంగా ఉన్నాయి. బీజేపీ కూటమికి 150-170 వరకు సీట్లు వస్తాయంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఎంవీయేకు 110-130 రావొచ్చని