తెలంగాణలో టీడీపీ బలపడితే ఎవరికీ లాభం..? ఎవరికి నష్టం..?

 తెలంగాణలో టీడీపీ బలపడితే ఎవరికీ లాభం..? ఎవరికి నష్టం..?

Who will get benefit, if TDP gets stronger in Telangana?

Loading

టీడీపీ అంటే ఉమ్మడి ఏపీలో 1983వరకు ఉన్న కాంగ్రెస్ నిరంకుశ పాలనకు చరమ గీతం పాడుతూ తెలుగోడి సత్తా ఏంటో ఢిల్లీకి చాటిచెప్పి అధికారంలోకి వచ్చిన ప్రాంతీయ పార్టీ.. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా దివంగత మాజీ ముఖ్యమంత్రి. విశ్వ నటుడు ఎన్టీఆర్ నాయకత్వంలోనూ … ఆ తర్వాత ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమాభివృద్ధి, సాధించిన ఘనతలు మన కండ్ల ముందు కన్పిస్తున్నాయి..

శనివారం ఎన్టీఆర్ భవన్ లో టీటీడీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ “టీడీపీ తెలుగు వారికోసం పుట్టిన పార్టీ.. తెలుగోడి ఖ్యాతిని దేశానికి కాదు ప్రపంచానికి చాటిచెప్పిన పార్టీ. అలాంటి పార్టీ కొన్ని పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రకే పరిమితం కావాల్సి వచ్చింది.. తెలంగాణలో గత రెండు ఎన్నికల్లో బరిలోకి దిగలేదు. ఏ పార్టీకి సపోర్ట్ చేయలేదు..

త్వరలోనే గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని కమిటిలు వేసుకొని పార్టీని బలోపేతం చేసుకుందాము.. త్వరలో జరగనున్న స్థానిక, పంచాయితీ ఎన్నికల్లో నిలబడదాము “అని పిలుపునిచ్చారు..అయితే టీడీపీ తెలంగాణలో నిలబడితే ఎవరికీ లాభం .?. ఎవరికీ నష్టం..?.. ఇప్పుడు ఓ విశ్లేషణలో చూద్దాము…!

టీడీపీకి తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికి నియోజకవర్గానికి రెండు లక్షల ఓటర్లు ఉన్నారని అనుకున్న కానీ కనీసంలో కనీసం ఇరవై వేల వరకు ఓటు బ్యాంకు ఉంటుంది. ఇది ఎవరూ కాదనలేని సత్యం. ఇప్పుడు ఉన్న బీఆర్ఎస్ లో కానీ అధికార కాంగ్రెస్ పార్టీలో కానీ ప్రధాన పాత్ర పోషించే నాయకులు టీడీపీ నుండి వచ్చినవాళ్లే.. కాంగ్రెస్ ను తీసుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి తదితరులాంటి వారు టీడీపీ నుండి వచ్చిన వాళ్లే..

మరోవైపు బీఆర్ఎస్ ను తీసుకుంటే ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ మొదలు మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల ఇలా పలువురు టీడీపీ నుండి వచ్చినవాళ్లే.. అయితే వీళ్ళు అంత మళ్ళీ మొదటికే వస్తారని కాదు.. టీడీపీ గత చరిత్ర ఘనం.. వర్తమానం గతం… భవిష్యత్ అయోమయం అని చెప్పడానికి మాత్రమే ఈ ఊదాహరణలు..

అయితే టీడీపీ బలపడటానికి ఉండే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ లు తప్ప ఏ పార్టీ కూడా పోటీలోనే లేదు. ఒకవేళ ఈ మూడింటిని తట్టుకుని నిలబడాలంటే టీడీపీకి నాయకత్వం కావాలి.. ప్రస్తుతం ఆ పార్టీకి సరైన నాయకుడే లేడు.. ఆర్థికంగా బాబు సహకరించిన కానీ ఆ పార్టీని నడిపించే నాయకుడే లేడు.. అందులో క్షేత్రస్థాయిలో క్యాడర్ ఉన్న కానీ అక్కడ నడిపించే నాయకుడు కానీ సరైన నాయకత్వం కానీ ఇప్పట్లో అందని ద్రాక్షనే టీడీపీకి..

ఐదేండ్లు ఏపీని జగన్ నాశనం చేశాడని చెప్పుకుంటున్న బాబు కు ఆ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికే సమయం సరిపోదు.. ఇక తెలంగాణలో తాడు బొంగరం లేని టీడీపీ కి ఎలా జీవసత్వాలు తీసుకొస్తారు. సమయం సరిపోదు.. ఆలా అని బాబును నమ్మే పరిస్థితి ఇక్కడ లేదు. క్యాడర్ పది వేలు ఇరవై వేలు ఉన్న కానీ వాళ్ళను నడిపించే నాయకత్వం కానీ నాయకుడు కానీ బాబుకు దొరకడం కష్టమే… టీడీపీ తెలంగాణలో మరో కమ్యూనిస్ట్ పార్టీ లెక్క ఉంటుంది తప్ప పూర్వ వైభవం రావడం.. అధికారంలోకి వచ్చే అంత సత్తా ఉండదు.. అయితే ఏపీలో లెక్క బీజేపీ జనసేనలతో కల్సి కూటమి గా పోటీ దిగితే మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ కూటమి వర్సెస్ గా ఎన్నికల రణరంగం మారినప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలి టీడీపీ కూటమి కి సగం.. బీఆర్ఎస్ కు సగం పోతుంది..

ఇప్పటికి బీఆర్ఎస్ కాంగ్రెస్ కు మధ్య ఓటు బ్యాంక్ శాతం కేవలం 1.8%మాత్రమే. అంటే కాంగ్రెస్ ఓటు బ్యాంకు చీలుతుంది.. గులాబీకి ఉన్న ఓటు బ్యాంకు అలాగే ఉండటమే కాకుండా దీనికి యాడ్ గా ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చేరుతుంది అన్నమాట…. మొత్తానికి చూసుకుంటే బీఆర్ఎస్ కే ప్లస్ అవుతుంది . కాంగ్రెస్ కు నష్టం అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.. చూడాలి మరి మున్ముందు ఏమి జరుగుతుందో అని…?

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *